: ఛత్తీస్ గఢ్ లో క్షణక్షణం ఉత్కంఠ.. తారుమారవుతున్న మెజారిటీ
ఛత్తీస్ గఢ్ లో ఫలితాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ప్రారంభంలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. తర్వాత కాంగ్రెస్ ముందుకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మొగ్గు బీజేపీ వైపునకు వెళ్లింది. ఇప్పటి వరకు బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ 12 చోట్ల గెలుపొందింది. ఇంకా 32 స్థానాల్లో బీజేపీ, 31 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మొత్తం 90 స్థానాలకుగాను ప్రభుత్వ ఏర్పాటుకు 46 చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది.