: రణబీర్-కత్రీనా పెళ్లి వేడుకలో చిందులేస్తా: కరీనా


బాలీవుడ్ నట ధ్వజం, అక్కా, తమ్ముళ్లు.. కరీనా కపూర్, రణబీర్ కపూర్ మధ్య కాఫీ విత్ కరణ్ కార్యక్రమం ఆసక్తికర విషయాలకు వేదిక అయింది. ఈ కార్యక్రమంలో కరీనా తన సోదరుడు రణబీర్ ను అడిగిన ప్రశ్నకు రణబీర్ తెలివిగా జవాబిచ్చాడు. నువ్వు కత్రినాను ప్రేమిస్తున్నావా? అని కరీనా రణబీర్ ను అడిగింది. అందుకు రణబీర్ 'నేను కరీనాను ప్రేమిస్తున్నాను' అనే సరికి ఆమె ఒక్కసారిగా ఫక్కున నవ్వారు.

ఒకవేళ రణబీర్, కత్రినా వివాహం చేసుకుంటే మీరేం చేస్తారు? అని కరణ్ జోహార్ కరీనాను ప్రశ్నించారు. తాను నృత్యం చేస్తానంటూ బదిలిచ్చింది. సినిమాల్లో ముద్దులు, శృంగార సన్నివేశాల్లో నటిస్తుంటే.. సైఫ్ ఎలా ఫీలవుతారు? అని అడగ్గా.. తాను చాలా అసౌకర్యంగా భావిస్తాడని చెప్పింది. ఈ కార్యక్రమం ప్రతీ ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ వరల్డ్ లో ప్రసారమవుతుంది.

  • Loading...

More Telugu News