: గర్ల్‌ ఫ్రెండ్‌కు మీ మీద ప్రేమ పెరగాలంటే ...


అమ్మాయిలను బుట్టలో వేయడానికి అబ్బాయిలు పడరాని పాట్లు పడుతుంటారు. వారికి రక రకాల బహుమతులను కొనిస్తూ ఉంటారు. అలాకాకుండా చిన్న లిప్‌స్టిక్‌ను వారికి కొనిపెట్టండి. ఇక ఠక్కున మీ మీద మీ గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రేమ పెరిగిపోవడం ఖాయం. ఇంతకీ ఈ లిప్‌స్టిక్‌ స్పెషాలిటీ ఏంటనేగా... అందంగా ఉండే మగువల పెదాలకు చక్కటి రంగు వేసుకుంటే మరింత అందంగా ఉంటారు. ముఖ్యంగా పార్టీలు, లేదా ఫంక్షన్లు వంటి వాటికి వెళ్లినప్పుడు అప్పటికప్పుడు పెదాలను మెరిపించడానికి లిప్‌బామ్‌, లేదా లిప్‌స్టిక్‌ వేసుకుంటే మరింత అందంగా కనిపించవచ్చు. ఇందుకోసం వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఉండే లైటింగ్‌ మీ పెదాలకు రంగులు అద్దుకోవడానికి సరిపోదు. అలాంటి సమయాల్లో మీకు చక్కగా ఉపకరించే విధంగా ఈ సరికొత్త లిప్‌స్టిక్‌ ఉపకరిస్తుంది. దీంతో ఎక్కడైనా మీ పెదాలను మెరిపించుకోవచ్చట.

అవసరమైన సందర్భాల్లో చక్కగా ఉపయోగపడే లిక్విడ్‌ లిప్‌స్టిక్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ లిప్‌స్టిక్‌తో చీకట్లో సైతం మీ పెదాలకు రంగులు వేసుకోవచ్చట. ఎలాగంటే ఈ లిప్‌స్టిక్‌ సీసా మూతకు లెడ్‌ బల్బులు ఉంటాయి. ఇవి మీరు మేకప్‌ వేసుకోవడానికి ఏమాత్రం వెలుతురు సరిపోకున్నా వెంటనే ఆటోమేటిక్‌గా వెలుగుతాయి. వెలుగు సరే... మరి అద్దం లేకుంటేనో... అని మీకు సందేహంగా ఉందా... ఆ సౌకర్యం కూడా ఇందులో ఉంది. ఈ లిప్‌స్టిక్‌ సీసాకు ఒకవైపు అద్దం ఉంటుంది. దీంతో అందులో చూసుకుంటూ మీ పెదాలకు రంగులద్దుకోవచ్చు. మరి ఇన్ని స్పెషాలిటీలున్న ఈ లిప్‌స్టిక్‌ని మీ గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చి ఆమెను బుట్టలో పడేయడానికి అబ్బాయిలకు మాత్రం ఇది బాగా ఉపయోపడుతుంది.

  • Loading...

More Telugu News