: మచిలీపట్నంలో రెండో రోజు బంద్ ప్రశాంతం
కేంద్ర మంత్రివర్గం రాష్ట్ర విభజనపై తీసుకొన్న నిర్ణయానికి నిరసనగా కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రెండో రోజు బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జిల్లా బంద్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో జిల్లా కలెక్టరేట్ పరిధిలోని అన్ని కార్యాలయాలు వెలవెలబోయాయి. పౌర సరఫరా శాఖ కార్యాలయం కూడా మూతబడింది. బందరులోని జిల్లా తపాలా శాఖ, చిలకలపూడి తపాలా కార్యాలయ మూసివేతతో ఉత్తరాల బట్వాడా నిలిచిపోయింది. విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంకులు, దుకాణాలు, పెట్రోల్ బంకులకు తాళాలు పడటంతో జనజీవనం స్తంభించింది.