: సోనియాగాంధీకి కేంద్ర మంత్రి పురంధేశ్వరి లేఖ


విభజన ముసాయిదా బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ సీమాంధ్ర నేతల విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదన చెందిన కేంద్రమంత్రి పురంధేశ్వరి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసినట్లు తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో సోనియాకు తెలిపానన్నారు. అంతేగాక తమ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కారించాలని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ సమస్యలు పరిష్కరించకుంటే విభజన బిల్లుకు వ్యతిరేకంగా లోక్ సభలో ఓటు వేయాల్సి ఉంటుందని పురంధేశ్వరి చెప్పారు. ప్రస్తుతం తాను మంత్రి పదవిలో లేనని, కార్యాలయానికి కూడా వెళ్లడం లేదన్నారు.

  • Loading...

More Telugu News