: కేసీఆర్ వాషింగ్టన్ లో పుడితే అక్కడ కూడా రాష్ట్రాలను విభజించే వారేమో?: రాంగోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడినా కుండ బద్ధలు కొట్టినట్టే ఉంటుంది. ఈసారి ఆయన రాష్ట్ర విభజన అంశంపై స్పందించాడు. వర్మ కేసీఆర్ ను ఉద్దేశించి అన్న మాటలు వివాదాన్నే కాదు... ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా ఆయన రాష్ట్ర విభజన అంశంపై ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వ్యాఖ్యల వివరాలు, వర్మ మాటల్లోనే..
సమైక్య రాష్ట్రాలను గురించి తెలుసుకోవాలంటే... మనం అమెరికాను గమనించాలి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇప్పటి వరకు విభజన ఆలోచన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అమెరికా ప్రజలు మద్యం, శృంగారానికే ప్రాముఖ్యతనిస్తారు. అందుకే అక్కడ వారికి వేర్పాటువాదం గురించి ఆలోచించే తీరిక లేదు.
భారతదేశంలో రాష్ట్రాలను సమైక్యంగా ఉంచే సమర్థత ఇక్కడి రాజకీయ నేతలకు లేదేమో..
కేసీఆర్ వాషింగ్టన్ లో పుడితే అక్కడ కూడా రాష్ట్రాలను విభజించే వారేమో?
కేసీఆర్ అమెరికాకు వెళితే ఎలా ఉంటుందో చూడాలని ఉంది.