: సీఎస్ మహంతిని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరిన అశోక్ బాబు
ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు కలిశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. పొరుగు సేవలు, ఒప్పంద కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. ఒప్పంద కార్మికుల సమస్యల గురించి గతంలోనే ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. వేతన సవరణ, సర్వీసు క్రమబద్ధీకరణ విషయంలో త్వరతగతిన నిర్ణయం తీసుకోవాలని సీఎస్ కు సూచించామన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు కోరేందుకు వైఎస్సార్ సీపీ, ఎంఐఎం తదితర పార్టీల అధ్యక్షులను కలుస్తామన్నారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి విభజన బిల్లును వ్యతిరేకించాలని ఆయన అన్ని పార్టీలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యత కోసమే తాము పోరాడుతున్నామని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలన్నారు. ఈ నెల 9వ తేదీ, సోమవారం తెలుగుజాతి విద్రోహ దినంగా ప్రకటించినందున నిరసనలు, ఆందోళనలు చేయాలని అశోక్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు.