: మా మాటే పట్టించుకోలేదు.. మేమేం చేస్తాం?: కావూరి
తాము ఎంత తీవ్రంగా వాదించినప్పటికీ.. విభజనకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం కేబినెట్ భేటీలో ముసాయిదా బిల్లు పెట్టిందని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. జీవోఎంని గతంలో చాలాసార్లు కలిశామని, పలువురు పార్టీల నేతలను కూడా చాలాసార్లు కలిసి పలు సూచనలు చేశామన్నారు. అయినప్పటికీ ప్రయోజనం శూన్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తథ్యం అని, విభజనకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలూ ఆమోదించాయని చెప్పారన్నారు. అయితే విభజన అన్యాయంగా జరుగుతోందని కావూరి ఆవేదన వ్యక్తం చేశారు.