: కాంగ్రెస్ లోనే కొనసాగుతా: జయసుధ


తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి వర్గానికి ఎమ్మెల్సీ సీటు కేటాయించని నేపథ్యంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు.

అంతకుముందు, బండ కార్తీక రెడ్డికి టిక్కెట్ ఇస్తే రాజీనామా చేస్తానని చెప్పిన జయసుధ అన్నంత పనీ చేశారు. రాజీనామా పత్రాన్ని సీఎంకు అందజేశారు. అయితే ఆయన దాన్ని ఆమోదించలేదని సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని జయసుధ పేర్కొన్నారు. ఇతర పార్టీలతో చర్చలు జరపలేదని ఆమె స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News