: ముంచుకొచ్చిన మంచు తుపాన్.. 1900 విమానాలు రద్దు
అమెరికాలో మంచు తుపాన్ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. నిన్న రేగిన తుపాను ధాటికి ఇళ్లు, రోడ్లు ఒకటేమిటి అన్నీ మంచుతో భారీ ఎత్తున కప్పబడిపోయాయి. యునైటైడ్ స్టేట్స్ లోని అస్టిన్, టెక్సాస్, ఓహియో వ్యాలీ, లుసియానా, అర్కన్సాస్, కనెక్టికట్ తదితర ప్రాంతాల్లోని నివాసాలు, రహదారులు మంచుతో కప్పబడి మూసుకుపోయాయి. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది.
దీంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో, 1900 విమానాలు రద్దు అయ్యాయి. దీంతో పలువురు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణీకులైతే ఏకంగా 12 గంటలపాటు విమానాశ్రయాల్లోనే చీకట్లో గడిపాల్సి వచ్చింది. తుపాను ధాటికి రైళ్లు, బస్సు సర్వీసులు కూడా రద్దయ్యాయి.