: నెల్లూరులో రూ.32 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత
నెల్లూరు జిల్లా మర్రిపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకున్నారు. చందనాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలంపై అటవీ శాఖాధికారులు దాడి చేశారు. 172 ఎర్రచందనం దుంగలను సీజ్ చేశామని, వాటి విలువ మార్కెట్లో 32 లక్షల రూపాయలని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు.