: 61 సంవత్సరాల మహిళతో 8 సంవత్సరాల బాలుడి వివాహం !
దక్షిణాఫ్రికాలోని ష్వానే లో 8 సంవత్సరాల బాలుడు, 61 సంవత్సరాల మహిళ వివాహం చేసుకున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్నాఇది వాస్తవం. సనేలే మసైలెలా అనే విద్యార్ధి, ఐదుగురు బిడ్డల తల్లి అయిన హెలెన్ షభంగు అనే వృద్ధురాలు ఇక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉంగరాలు మార్చుకున్నారు. అంతేకాదండోయే... ఒకరినొకరు ముద్దు కూడా పెట్టుకున్నారు.
ఈ వివాహానికి ఆమె పిల్లలు, భర్తతో పాటు సుమారు 100 మంది అతిధులు హాజరయ్యారని లండన్ లోని 'ద సన్' పత్రిక తెలిపింది. కానీ, వీరిద్దరూ వివాహపు ధ్రువీకరణ పత్రంపై సంతకం చేయలేదు. అయితే ఈ పెళ్లి కేవలం తమ ఆచారాల్లో ఓ భాగమని, చట్టబద్ధం కాదని బాలుడి కుటుంబం పేర్కొంది. మరోవైపు షభంగును వి
పెద్దయిన తర్వాత తన వయసు యువతినే వివాహం చేసుకుంటానన్నాడు. మరి ఎందుకిలా ఎనిమిదేళ్ల బాలుడు అరవయ్యేళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడని అనుమానం కలుగతుంది కదా ? అసలు విషయంలోకి వెళ్తే... బాలుడికి 46 సంవత్సరాల తల్లి ఉంది. ఆమె తండ్రి కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎప్పుడు చనిపోతాడో తెలియని ఆయన పోయే ముందు మనవడి వివాహాన్ని చూడాలన్న కోరికను వెలిబుచ్చాడు.
తాత కోరిక తీర్చేందుకు బాలుడు అంగీకారం తెలపడంతో ఈ పెళ్లి జరిగింది. తమ ఆచారాల కారణంగానే ఇలా చేయాల్సి వస్తుందని, అలా చేయకపోతే తమ కుటుంబానికి కీడు వాటిల్లుతుందని భయపడుతున్నట్టు బాలుడి తల్లి షభంగుకు తెలిపిందట. దీంతో, వెంటనే బాలుడితో పెళ్లికి ఒప్పుకున్నట్టు షభంగు వెల్లడించింది.