: హెపటైటిస్ సీ వైరస్ పై పోరాటానికి కొత్త ఔషధం
హెపటైటిస్ సీ వైరస్ ను నియంత్రించే సరికొత్త ఔషధానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి(యూఎస్ ఎఫ్ డీఏ) ఆమోదం తెలిపింది. ఈ మాత్ర పేరు సోవాల్డి. హెపటైటిస్ పై పోరాటంలో ఇది ప్రయోగాల దశలో మంచి ఫలితాలను చూపింది. రెండు వారాల క్రితం యూఎస్ ఎఫ్ డీఏ హెపటైటిస్ సీని నియంత్రించే వేరొక ఔషధం ఒలీసియోను కూడా ఆమోదించిన విషయం తెలిసిందే.