: నిరసనలతో హోరెత్తుతున్న సీమాంధ్ర
సీమాంధ్రలో రెండో రోజు నిరసనలు హోరెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రక్రియను తక్షణం నిలిపివేయాలంటూ టీడీపీ, వైఎస్సార్ సీపీ, ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చిన బంద్ రెండో రోజు సీమాంధ్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. విద్యా, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా బంద్ కు సహకరిస్తున్నారు. సీమాంధ్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పోలీసులు, భద్రతా బలగాలు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాయి. దీంతో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.