: రాజీనామా ఆమోదించాలంటూ సోనియాకు చిరంజీవి లేఖ
కేంద్ర మంత్రి చిరంజీవి తన రాజీనామాను ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల హక్కులు నెరవేరాలంటే హైదరాబాదును యూటీ చేయాలని, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని గొంతెత్తిన చిరంజీవి ఇతర కేంద్ర కాంగ్రెస్ నేతల కంటే ముందుగా తన అసంతృప్తిని బయటపెడుతూ లేఖ రాశారు. తాను గతంలో అక్టోబరు 4వ తేదీన ప్రధానికి పంపిన లేఖలో రాజీనామాను ప్రస్తావించానని, రాజీనామాను తక్షణం ఆమోదించాలని సోనియాకు రాసిన లేఖలో ఆయన కోరారు.