: తాంబూలాలిచ్చేశారు.. మేము తన్నుకు చావాలి: ఆనం వివేకా


'తాంబూలాలిచ్చేశాం... తన్నుకు చావండి' అని కేంద్ర కేబినెట్ బిల్లును ఆమోదించడం ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసిందని కాంగ్రెస్ నేత ఆనం వివేకానంద రెడ్డి అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వారికి బంగారు పళ్లెంలో ఆకు, వక్క, సున్నం, స్వీటు, మసాలాలు పెట్టి వాయినమిచ్చిందని అన్నారు. సీమాంధ్ర ప్రజలకు మాత్రం ఆకు, సున్నం మాత్రం వేసి నోరు పొక్కిపోయేలా చేసిందని ఆయన అన్నారు. మడమ తిప్పం అనేవాళ్లతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలంతా విభజనను వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా ఉన్నవారినందర్నీ ఏకతాటిపై తీసుకువస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News