: చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో సమస్యలు పరిష్కారం కావు: యూపీ సీఎం అఖిలేష్
ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకోవాలని జగన్ కోరారు.రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు సహకరిస్తామని అఖిలేష్ తెలిపారు. భేటీ అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని, చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమాజ్ వాదీ పార్టీ సమర్థించదని అఖిలేష్ యాదవ్ చెప్పారు. చిన్న రాష్ట్రాలతో సమస్యలు పరిష్కారం కావని, విడిపోయిన తర్వాత ఉత్తరాంచల్ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అఖిలేష్ ఉధహరించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు తప్పక వ్యతిరేకిస్తామన్నారు. వైఎస్ జగన్ తో రాజకీయాలకు అతీతంగా స్నేహం కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.