: గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కాదు... గ్యాంగ్ ఆఫ్ మినిస్టర్స్: చంద్రబాబు
పూటకో మాట.. గంటకో లీకు ఇచ్చి, వీరు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గా కాకుండా, గ్యాంగ్ ఆఫ్ మినిస్టర్స్ గా తయారయ్యారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేరుతో విభజనపై వీరు చేసిన కసరత్తు ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు, శాసనసభకు సంబంధం లేకుండా, అధికారులను ఢిల్లీకి పిలిపించుకుని ఏ రకంగా విభజన చేస్తారని ఆయన నిలదీశారు. తప్పుడు విధానాలతో దొంగపద్దతుల ద్వారా.. లీకులు ఇస్తూ లేనివి ఉన్నట్టు తమ ప్రాంత నేతలతో మాట్లాడించి, టేబుల్ ఐటెంగా కోట్లాది మందికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నందుకు గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ జవాబుదారీ తనం వహించాలని ఆయన నిలదీశారు.