: తేజ్ పాల్ కేసులో ముగ్గురు 'తెహల్కా' జర్మలిస్టుల వాంగ్మూలం నమోదు
'తెహల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కేసులో సంస్థకు చెందిన ముగ్గురు జర్నలిస్టుల వాంగ్మూలాన్ని గోవా పోలీసులు నమోదు చేశారు. మరోవైపు ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తరలిస్తున్నట్లు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ తెలిపారు. ఈ కోర్టుకు మహిళా జడ్జే ఉంటారని చెప్పారు. కాగా, రేపు తేజ్ పాల్ పోలీస్ కస్టడీని పెంచాలని కోర్టును కోరనున్నారు.