: విద్యాసంస్థల్లో తెలంగాణ వారికే హక్కు: కేసీఆర్


ఉన్నత విద్యాసంస్థల్లో అవకాశాలపై రెండు ప్రాంతాల విద్యార్థులకు సమాన అవకాశాలు అని ముసాయిదాలో పేర్కొన్నారని కేసీఆర్ తెలిపారు. కొంత మంది ఐదేళ్ల పాటు ఈ విధానం కొనసాగుతుందని.. మరి కొందరు ఇది పదేళ్ళ పాటు కొనసాగుతుందని పేర్కొన్నారని, ఇలా అయితే తమకు తెలంగాణ ఏర్పాటు చేసి ఉపయోగం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆయా విద్యాసంస్థల్లో కామన్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తారని వింటున్నామని, అలాంటి ప్రయత్నాల వల్ల తెలంగాణ ఏర్పాటు చేసి ఉపయోగం ఏంటి? అని కేసీఆర్ ప్రశ్నించారు. తమ ప్రాంత విద్యార్థులకే అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండు చేశారు.

  • Loading...

More Telugu News