: హైదరాబాదు అధికారంపై ప్రధానికి లేఖ రాయాలని టీఆర్ఎస్ నిర్ణయం
విభజన నేపథ్యంలో హైదరాబాదుపై గవర్నర్ కు అధికారాన్ని కట్టబెట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడాన్ని టీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ రోజు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. కాగా, అప్పులు, ఆస్తుల పంపకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన అప్పులు పంపిణీ చేయడం దారుణమని, ప్రాజెక్టుల వారీగానే అప్పుల పంపకం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఒకరోజే చర్చ జరిగే అవకాశం ఉన్నందున హైదరాబాదు ఆంక్షలను ప్రజలకు వివరించాలని నేతలకు కేసీఆర్ సూచించారు.