: విభజన నిర్ణయంపై భగ్గుమన్న బందరు
ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయంపై కృష్ణా జిల్లా వాసులు కన్నెర్ర చేశారు. ఇవాళ కృష్ణా జిల్లా బంద్ సంపూర్ణంగా సాగింది. నిరసనలు, సమైక్యాంధ్ర నినాదాలతో జిల్లా కేంద్రమైన మచిలీపట్నం (బందరు) హోరెత్తింది. బందరు ప్రధాన కూడలి కోనేరు సెంటర్, బస్టాండ్ సెంటర్ లు బంద్ ప్రభావంతో వెలవెలబోయాయి. విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు మూసివేయడంతో బందరులో జన జీవనం స్తంభించింది. ప్రభుత్వ ఉద్యోగుల గైర్హాజరుతో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. బస్టాండ్ సెంటర్ లో వివిధ పార్టీల నేతలు ధర్నాచేశారు. హోంగార్డులు సైతం బంద్ కు మద్దతు తెలుపుతూ కవాతు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు.