: ఈ నెల 9న తెలుగుజాతి విద్రోహదినం :అశోక్ బాబు
డిసెంబర్ 9వ తేదీని తెలుగుజాతి విద్రోహదినంగా పాటిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ విద్రోహదినం సందర్భంగా నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు నిర్వహిస్తామని అన్నారు. అలాగే విభజనకు కారకులైన వారి చిత్రపటాలను దహనం చేస్తామని అశోక్ బాబు తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు కలిసి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికైనా రాజకీయాలు మాని, విభేదాలు పక్కన పెట్టి రాష్ట్ర సమైక్యత కోసం పోరాడాలని ఆయన సూచించారు. తదుపరి కార్యాచరణ ఈ నెల 9న వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు వారి రాజకీయ జీవితానికి వారే సమాధులు తవ్వుకున్నారన్నారు. నేతల తీరు చూసి సీమాంధ్రులు తీవ్ర ఉద్వేగానికి గురవుతున్నారని ఆయన తెలిపారు.