: పుట్టింది ఆడపిల్ల అని బండకేసి బాదేశాడు
ఆడపిల్ల పుడితే అవమానంగా భావించే వ్యక్తులు ఇంకా సమాజంలో మిగిలే ఉన్నారు. పురుషాహంకారం నరనరానా జీర్ణించుకున్న ఓ కసాయి తండ్రి కన్నబిడ్డ అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా బండకేసి కొట్టి చంపాడు. ఆడపిల్ల అన్న కారణంతో 14 రోజుల పసికందును హతమార్చాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు లో జరిగింది.