: ఆది మానవుడు ఒక గొరిల్లా అట!
ఆది మానవుడు ఎలా ఉంటాడన్నదానిపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఎన్నో ఆధారాలు లభ్యమయ్యాయి. ఆది మానవుడు గొరిల్లా వలే ఉండేవాడని తాజా అధ్యయనంలో వెల్లడైంది. టాంజానియాలోని గోర్జ్ వరల్డ్ హెరిటేజ్ ఫాసిల్ క్షేత్రం వద్ద లభించిన ఒక అస్తిపంజరం ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ వివరాలను వెల్లడించారు. చాలా బలమైన దవడ, పుర్రె ఎముకలను బట్టి చూస్తే ఆదిమానవుడి దేహంపై భాగం గొరిల్లా వలే ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు.