: నెట్ లేకపోయినా మొబైల్లో ట్విట్టర్


ఇంటర్నెట్ లేకపోయినా బేసిక్ మొబైల్ ఫోన్ల నుంచే ట్వీట్స్ తో ట్విట్టర్ విహంగానికి త్వరలో వీలుకలగనుంది. ఇందుకోసం ట్విట్టర్ సింగపూర్ కు చెందిన యూ టు ఓపియా మొబైల్ తో ఒప్పందానికి వచ్చింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో నెట్ లేని మొబైల్ ఫోన్లలో ట్విట్టర్ సేవలను అందుబాటులోకి తెస్తామని యూ టు ఓపియా మొబైల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సురేష్ మీనన్ తెలిపారు.

యూజర్లు ఒక కోడ్ టైప్ చేసి పంపిస్తే చాలు.. ట్విట్టర్లోని ప్రాచుర్యాంశాల జాబితా వచ్చేస్తుంది. నచ్చిన వాటిపై స్పందించడమే తరువాయి. అయితే, ఫొటోలు, వీడియోలు, గ్రాఫిక్స్ చూసేందుకు వీలు పడదు. యూ టు ఓపియా మొబైల్ ఇప్పటికే ఫేస్ బుక్, గూగుల్ టాక్ యూజర్లకు ఇలాంటి సేవలు అందిస్తోంది. కోటి మందికిపైగా ఈ సంస్థకు చెందిన మొబైల్ ఫోనెట్ విష్ సేవలను వినియోగించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News