: విభజన నిర్ణయంపై అట్టుడుకుతున్న సీమాంధ్ర


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయంపై సీమాంధ్ర అట్టుడుకుతోంది. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఏపీఎన్జీవోలు బంద్ కు పిలుపునిచ్చారు..ఇక వైఎస్ఆర్సీపీ, టీడీపీ శ్రేణులు కూడా బంద్ కు మద్దతు ప్రకటించాయి. తూర్పు గోదావరి జిల్లాలోని 9 ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. విద్య, వాణిజ్య సంస్థలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రాజోలులో జాతీయ రహదారులను మూసి వేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో బంద్ ప్రభావంతో జూట్ మిల్లులు మూతపడ్డాయి. ఇక జగ్గంపేట, పి.గన్నవరంలో కూడా బంద్ జరుగుతోంది.

విశాఖపట్నంలో సమైక్య వాదులు జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. దీంతో ఎక్కడికక్కడ బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. కేజీహెచ్ లో వైద్య సేవలను కూడా నిలిపివేశారు. శ్రీకాకుళంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. కొన్ని విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి. కృష్ణా జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కూడా బంద్ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News