: హాస్టల్ నుంచి విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న 'అనంత' పోలీసులు
అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో, ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో, విద్యార్థులపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులను బలవంతంగా హాస్టల్ నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడకు భారీ సంఖ్యలో పోలీసులు, కేంద్ర బలగాలు చేరుకున్నాయి. విద్యార్థుల నిరసనకు జిల్లా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయి.