: దేవినేని ఉమ అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే దేవినేని ఉమ అరెస్టయ్యారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలపడంతో.. 48 గంటల బంద్ లో భాగంగా టీడీపీ శ్రేణులు విజయవాడలో నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఉమ ఆధ్వర్యంలో బెంజి సర్కిల్లో రహదారిపై రాస్తారోకోకు దిగాయి. దీంతో పోలీసులు ఉమతోపాటు, కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు.