: చాలా తృప్తిగా ఉంది బాబూ..!: ఎమ్మెల్సీ వ్యవహారంపై 'దాడి'


టీడీపీలో ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న అలకలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక తీరు పట్ల అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు అసహనం వెళ్ల గక్కారు. పార్టీకి చేసిన సేవకు తగిన ఫలితాన్ని చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

మరొకరికి ఇస్తానని నాలుగు రోజుల ముందే చెప్పి ఉంటే మర్యాదగా తానే తప్పుకునే వాడినని వ్యాఖ్యానించారు. అలా కాకుండా నామినేషన్ వేసే సమయంలో తనను ఎంపిక చేయడం లేదని చెప్పడం న్యాయం కాదని బాబుతోనే చెప్పానన్నారు. ఆయన అభిప్రాయం, నిర్ణయంతో తాను ఏకీభవించడం లేదని బాబుకు తెలిపానన్నారు.

అయితే అభ్యర్ధిగా ఎంపికైన యనమల రామకృష్ణుడుపై తనకు అపారగౌరవం ఉందన్నారు. తెలుగుదేశంలో తమకు కనీస మర్యాద కూడా లభించదా? అని దాడి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, శనివారమే యనమల, సలీమ్, శమంతకమణిలను పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News