: పోలీసు బలగాల గుప్పిట్లో సీమాంధ్ర


సీడబ్ల్యూసీ తీర్మానం సందర్భంగా చెలరేగిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ అప్రమత్తమైంది. కేబినెట్ భేటీ నిర్ణయం ప్రకటన తరువాత రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతంలో హింస చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్, స్పెషల్ పోలీస్ ఫోర్సుకు చెందిన 71 బెటాలియన్ల బలగాలను మోహరించింది. ఇవి కాకుండా మరిన్ని అదనపు బలగాలను సీమాంధ్ర ప్రాంతానికి పంపించనుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర నేతల ఇళ్లకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీమాంధ్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తుండడం విశేషం. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వెల్లడవుతోంది.

  • Loading...

More Telugu News