: ముంబైలో మోడీ ర్యాలీకి భారీ ఏర్పాట్లు
బీజేపీ డిసెంబర్ 22న ముంబైలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేసుకుంటోంది. మహారాష్ట్ర బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడకుండా ర్యాలీని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించేందుకు మొత్తం 36 కమిటీలు ఏర్పాటు చేశారు. ర్యాలీ నిమిత్తం పార్టీ శ్రేణులు ముంబై చేరుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి 14 రైళ్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో బూత్ స్థాయి నేతలంతా హాజరుకావాలని ఇప్పటికే ఆ రాష్ట్ర బీజేపీ ఆహ్వానాలు పంపింది. పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు కూడా ర్యాలీలో పాల్గొనేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది.