: పార్టీ పెద్దలపై 'చిరు' కోపం..!
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో తన అనుయాయులకు చోటు కల్పించేందుకు చివరికంటా పోరాడిన కేంద్రమంత్రి చిరంజీవి ఆ ప్రయత్నంలో విఫలమైనట్టు తెలుస్తోంది. తాను స్వయంగా ఫోన్ చేసి చెప్పినా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో చిరు మనస్తాపానికి గురైనట్టు సమాచారం.
తన వర్గీయులైన కోటగిరి విద్యాధరరావు, గౌతమ్ లలో ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని ఈ మధ్యాహ్నం చిరంజీవి.. పీసీసీ చీఫ్ బొత్సకు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను అప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది.