: సీమాంధ్రలో కాంగ్రెస్ నేతల నివాసాల వద్ద భద్రత కట్టుదిట్టం
కాంగ్రెస్ నాయకుల నివాసాల వద్ద భద్రతను పెంచారు. హస్తినలో ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశమై జీవోఎం నివేదికను పరిశీలిస్తున్నారు. దీంతో సీమాంధ్రలో ముందు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. చిత్తూరు ఎంపీ చింతామోహన్, కేంద్ర మంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి, ఎంపీ రాయపాటి సహా పలువురు మంత్రుల ఇళ్ల వద్ద భద్రతను పెంచారు.
అనంతపురం నగరంలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. ఐదు కంపెనీలకు చెందిన 600 మంది కవాతు చేశారు. అదనపు బలగాల మోహరింపు చర్యల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే అనంతలో మూడు కంపెనీల బలగాలు అందుబాటులో ఉన్నాయి.