: కాకినాడలో ఇసుక థెరపీ.. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం


విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఇసుక థెరపీ మన కాకినాడ తీరంలో ఊపిరి పోసుకుంది. సరదాగా పిల్లలు ఆడుకునేప్పుడు ఇసుకను మీద పోసుకుని కప్పెట్టుకోవడం మనం చూసే ఉంటాం. తాజాగా కాకినాడ వాకలపూడి సముద్రతీరంలో నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ వైద్యనిపుణులు 300 మంది రోగులకు ఇసుక థెరపీని చేశారు.

రోగి వ్యాధి, నాడీ పరిస్థితులను బట్టి రోగులను సముద్రతీరంలో పరుండబెట్టి తడిఉప్పుతో కూడిన సముద్రపు ఇసుకను వారిపై ఎత్తుగా పోసి తరచూ నీటిని చల్లుతూ రెండు గంటల పాటు థెరఫీ ఇచ్చారు. ఈ విధానం ద్వారా ఉప్పునీటిని శరీరం పీల్చుకుని.. దీర్ఘకాలం శరీరంలో ఉన్న వ్యాధులు తొలగిపోతాయన్నారు. ఉపిరితిత్తులు, కిడ్నీ, చర్మ సమస్యలు, కీళ్ల నొప్పులు, మధుమేహం, అస్తమా, బీపీ, ఒత్తిడివల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని డాక్టర్ పి కృష్ణంరాజు తెలిపారు. ఇది అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉన్న వైద్యవిధానమని చెప్పారు.

  • Loading...

More Telugu News