: వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ పై ఎఫ్ఐఆర్
వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ పై ఉత్తరప్రదేశ్ లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ముస్లింల మత భావాలను గాయపరిచేలా, మత పెద్దలపై గతనెల ఆరున తస్లిమా ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలపై యూపీలోని బారెల్లీలో ఓ మత పెద్ద ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు లక్నోలో తెలిపారు. అంతేగాక తస్లిమా పాస్ పోర్టును సీజ్ చేయాలని, ఆమెను అరెస్టు చేయాలని మరికొంత మంది డిమాండ్ చేస్తున్నారు.