: వారసత్వం తీసుకుంటే సరిపోదు.. తప్పిదాలనూ వారసత్వంగా తీసుకోవాలి: రావుల
వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన తండ్రి వారసత్వాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోదని.. తండ్రి తప్పిదాలను కూడా వారసత్వంగా తీసుకోవాలని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ సూచించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ జగన్ ఇప్పటికైనా తన తండ్రి పాలనకు, టీడీపీ పాలనకు మధ్య ఉన్న తేడాను గ్రహించాలని కోరారు. రాష్ట్ర హక్కుల కోసం ప్రధానిని సైతం ఎదిరించిన ఘనత టీడీపీకే ఉందన్న రావుల... ఉన్న హక్కులను కూడా వద్దని లేఖ ఇచ్చి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో రైతుల కన్నీరు పారేలా చేసిన ఘనత రాజశేఖరరెడ్డిదే అని విమర్శించారు.