: ఆ పాపం వైయస్ దే: టీడీపీ నేత మండవ
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు పాపం దివంగత ముఖ్యమంత్రి వైయస్ దేనని టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. దీనికితోడు, మిగులు జలాలు అవసరం లేదంటూ వైయస్ ఇచ్చిన అఫిడవిట్ కాపీని కూడా మీడియాకు చూపించారు. ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రైబ్యునల్ తీర్పుపై కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం అవగాహన లేదని అన్నారు. ప్రధాని మన్మోహన్ ఓ మైనపు బొమ్మ అని... ఆయనతో ఎంత మొర పెట్టుకున్నా ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచకుండా తమ నేత చంద్రబాబు అడ్డుకున్నారని మండవ తెలిపారు.