: రణబీర్ కపూర్ కు అసూయ ఎక్కువే
చక్కటి నటనను ఎవరు పండించినా అభినందించాల్సిందే. కానీ, బాలీవుడ్ కుర్ర హీరో రణబీర్ కపూర్ మాత్రం అసూయతో రగిలిపోతాడట. ముఖ్యంగా తన సమకాలీన నటులు బాగా చేస్తే ఈర్ష్య పడిపోతానని 'కాఫీ విత్ కరణ్ జోహార్' అనే టీవీ కార్యక్రమంలో రణబీర్ వెల్లడించాడు. అమితాబ్ నుంచి వరుణ్ ధావన్ వరకూ ప్రతీ ఒక్కరు తనకు పోటీయేనని చెప్పాడు. ప్రతీ ఆదివారం రాత్రి స్టార్ వరల్డ్ చానల్ లో కాఫీ విత్ కరణ్ జోహార్ ప్రసారమవుతుంది.