: పోలీసులకు నిద్రలేకుండా చేస్తున్న 'ఏటీఎమ్' నిందితుడు


ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల పోలీసులు 400 మంది ఒక నిందితుడి కోసం రేయింబవళ్లు అన్వేషిస్తున్నారు. ఇటు అనంతపురంలో అటు కర్ణాటకలోని సరిహద్దు జిల్లాలతోపాటు బెంగళూరు నగరంలో పోలీసులు గాలిస్తున్నారు. అయినా, ఇంత వరకు ఏటీఏంలో జ్యోతిపై దాడి చేసి పరారైన నిందితుడు దొరకలేదు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ వేట తర్వాత మళ్లీ ఒక నిందితుడి కోసం కర్ణాటక పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తోంది ఏటీఏం నిందితుడి కోసమే. గతంలో వీరప్పన్ కోసం 500 మంది సిబ్బందిని వినియోగించామని.. ఇప్పుడు ఏటీఎం నిందితుడిని పట్టుకునేందుకు 200 మంది సిబ్బందిని నియమించామని ఒక పోలీసు అధికారి తెలిపారు. నిందితుడి ఫొటోతో ప్రతీగ్రామంలోనూ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News