: రాబర్ట్ వాద్రా స్థల వివాదంలో ఐఏఎస్ అధికారిపై ఛార్జ్ షీట్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా-డీఎల్ఎఫ్ ల స్థల వివాదం వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాపై హర్యానా ప్రభుత్వం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పదిహేను రోజుల్లోగా ఖేమ్కా ఛార్జ్ షీటుపై వివరణ ఇవ్వాలని తెలిపింది. వాద్రా-డీఎల్ఎఫ్ స్థల ఒప్పందాన్ని రద్దు చేసి, వారి పేరును దెబ్బతీసినందుకు ఈ ఛార్జ్ షీట్ నమోదైంది. గతంలో ఈ వివాదంలో ఖేమ్కాను ఓ ప్రాంతం నుంచి మరో చోటకి ట్రాన్స్ ఫర్ కూడా చేశారు.