: పొంతన లేని వ్యాఖ్యలతో అయోమయం సృష్టిస్తున్న జైరాం, చిదంబరం


తెలంగాణ అంశంపై జీవోఎం సభ్యులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. వారి వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అంతే కాకుండా, వీరి వ్యాఖ్యలు ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఉద్రిక్తతలకు కూడా ఆజ్యం పోస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, రాయల తెలంగాణపై జీవోఎం సభ్యులైన జైరాం రమేష్, చిదంబరంలు పొంతన లేని వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ, రాయల తెలంగాణ అంశాన్ని తోసిపుచ్చలేమని జైరాం రమేష్ అన్నారు. అయితే దీనికి పూర్తి భిన్నంగా చిదంబరం స్పందించారు. రాయల తెలంగాణ ఎక్కడుందంటూ ఆయన ఏకంగా మీడియానే ప్రశ్నించారు. ఇక డిగ్గీరాజా, షిండేల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీరు ఏది మాట్లాడితే, కచ్చితంగా దానికి వ్యతిరేకంగానే చేస్తారు.

  • Loading...

More Telugu News