: సోనూ నిగమ్ చెప్పిన టెక్నాలజీ రహస్యం
నేడు ప్రతీ గాయకుడు, గాయకురాలి స్వరం చక్కగా ఉంటోందని.. అది టెక్నాలజీ మహిమేనని ప్రముఖ బాలీవుడ్ స్వరకర్త సోనూనిగమ్ అన్నారు. 'గతంలో లతాజీ, ఆశాజీ సింగిల్ టేక్ లో పాటను పూర్తిచేసేవారు. ఒక్క పరికరం పనిచేయకపోయినా మళ్లీ మొదటి నుంచి పాడేవారు. కానీ, నేడు లైన్ వారీగా పాడవచ్చు. ప్రతీ నోట్ ను కంప్యూటర్లో ట్యూన్ కు అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. దానివల్ల స్వరం బావుంటోంది. దీంతో సులభంగా పాడే అవకాశం దక్కించుకోవచ్చు' అంటూ సోనూ చెప్పారు. టెక్నాలజీ వల్ల ప్లస్, మైనస్ రెండూ ఉంటాయన్నారు. సురేష్ వాడ్కర్, హరిహరన్, తలాత్ అజీజ్, పంకజ్ ఉదాస్ తదితరులు లెజెండ్స్ అని వారిని మనం గౌరవించాలన్నారు. 'ఎవరు పాడగలరు, ఎవరు పాడలేరో టెక్నాలజీ తేలుస్తుంది. ఇదే పరిశ్రమకు ఎంతోమంది గాయకులను ఇస్తోంది' అంటూ నిజాలను నిక్కచ్చిగా చెప్పేశారు.