: పెషావర్ కు పిల్లలతో కలిసి వెళ్లనున్న షారూక్


షారూక్ పాకిస్థాన్ లోని పెషావర్ కు వెళ్లాలనుకుంటున్నారు. చిన్నతనంలో అక్కడ గడిపిన మధుర క్షణాలను ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. షారూక్ కు 15 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన తండ్రి పాక్ లోని పెషావర్ కు తీసుకెళ్లారు. ఇప్పుడు తాను కూడా తన పిల్లలకు అలాంటి స్మృతులను అందివ్వాలని షారూక్ ఆశపడుతున్నారు. ఈ విషయాన్ని షారూకే మీడియాకు చెప్పారు.

'మా కుటుంబం పెషావర్ నుంచి వచ్చింది. ఇప్పటికీ అక్కడ కొంత మంది నివసిస్తున్నారు. పాక్ కు నా పిల్లలతో కలిసి రావడాన్ని ఇష్టపడతాను. ఎందుకంటే నాకు 15-16 ఏళ్ల వయసున్నప్పుడు నాన్న కూడా ఇలానే తీసుకెళ్లారు. పెషావర్, కరాచీ, లాహోర్ లో నాన్నతో గడిపిన అద్భుత జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తున్నాయి' అని పాక్ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీతో లోగడ చెప్పిన విషయాలను షారూక్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News