: గాగుల్స్ కదిలించినా సల్మాన్ సినిమా సక్సెస్: అమీర్ ఖాన్
సల్మాన్ ఖాన్ తో తనకేమీ వైరం లేదని.. ఆయన తన కంటే పెద్ద స్టార్ అని నటుడు అమీర్ ఖాన్ తెలిపారు. పోటీ అనేది తన స్వభావంలోనే లేదన్నారు. సల్మాన్ తన స్నేహితుడిగా పేర్కొన్నారు. 'ఒక సినిమా కోసం నేనెంతో సన్నద్ధం అవుతాను. కానీ సల్మాన్ కు ఆ అవసరం లేదు. బెల్ట్ షేక్ చేసినా, గాగుల్స్ కదిలించినా చాలు, సల్మాన్ సినిమా విజయవంతం అవుతుంది. ఇది సంతోషకరం' అని చెప్పారు. అమీర్ తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాననే ఆవేదన వ్యక్తం చేశారు.