: హైదరాబాదులో జగన్ కాన్వాయ్ పై విద్యార్థుల దాడి
చెన్నై పర్యటన ముగించుకుని హైదరాబాదు వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పై రాజేంద్రనగర్ లో విద్యార్థులు దాడి చేశారు. టమోటాలు, కోడిగుడ్లు విసిరారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం దాడికి పాల్పడిని వారిని అదుపులోకి తీసుకున్నారు.