: కండోమ్స్ కేకుల్లా అమ్ముడుపోవడానికి ఓ ఐడియా


రైల్వే స్టేషన్లో ఉన్నారు. 'కండోమ్స్... కండోమ్స్' అంటూ ఒక కేక వినిపిస్తోంది. బస్టాండ్ లో ఉన్నారు. మళ్లీ 'కండోమ్స్... కండోమ్స్' అంటూ కేక. ఈసారి మార్కెట్లో ఉన్నారు. ఇక్కడా అదే కేక. ఇదేంటీ, అనే సందేహం వచ్చేసుంటుంది. మహిళా కండోమ్స్ అమ్ముడుపోవడానికి నెదర్లాండ్స్ కు చెందిన ఆరోగ్య రంగ నిపుణురాలు బీట్రిజ్ జాన్సన్ ఈ ఐడియాకు తెరతీశారు.

రద్దీ ప్రదేశాలలో ట్రేలో బిస్కట్ పాకెట్లు.. చిప్స్ పాకెట్లు.. జ్యూస్ ప్యాకులు, చాక్లెట్లు పెట్టుకుని పెద్దగా అరుస్తూ విక్రయించడం మనం చూసే ఉంటాం. బీట్రిజ్ ఐడియా కూడా ఇంతే. కాకపోతే ఆ ట్రేలలో తిండి పదార్థాలకు బదులు కండోమ్స్ ఉంటాయి. ఇప్పటికే ఈ ఐడియా చాలా దేశాల్లో మంచి ఫలితాలనిస్తోంది. భవిష్యత్తులో మనదేశంలోనూ దీన్ని చూడవచ్చు. తాను చాలా దేశాల్లో ఇదే విధమైన ప్రచారం చేశానని బీట్రిజ్ తెలిపారు. ఒక మహిళగా కండోమ్స్ ప్రాధాన్యం గురించి తెలిసి ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News