: ఉభయ సభలూ రేపటికి వాయిదా
కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి ఉదయం వరకు వాయిదా పడ్డాయి. మరణించిన పార్లమెంటు సభ్యులకు సంతాపం ప్రకటించిన అనంతరం, లోక్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. అలాగే, రాజ్యసభను రేపటి వరకు వాయిదా వేస్తున్నట్టు హమీద్ అన్సారీ ప్రకటించారు. దీంతో సమావేశాల మొదటి రోజు ముగిసింది.