: ట్రైబ్యునల్ తీర్పుపై చర్చకు లోక్ సభ స్పీకర్ కు ఎంపీ నామా నోటీసు
ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలపై బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై చర్చించేందుకు అనుమతించాలని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు నోటీసు అందజేశారు. బ్రిజేశ్ ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నందున ప్రశ్నోత్తరాలు రద్దు చేసి చర్చకు అవకాశం ఇవ్వాలని నామా కోరారు.