: శబ్ద తరంగాలతో సమాచారాన్ని పంపే కొత్త మాల్ వేర్


అధిక తరంగ దైర్ఘ్యం గల శబ్ద తరంగాల ద్వారా సమాచారాన్ని ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్ కు సరఫరా చేసే సరికొత్త మాల్ వేర్ ను జర్మనీకి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. కంప్యూటర్లను నెట్ వర్క్ తో అనుసంధానం చేయకుండానే ఒకదాని నుంచి మరొకదానికి ఈ మాల్ వేర్ ద్వారా సమాచారాన్ని సరఫరా చేసి చూపించారు. అత్యధిక తరంగదైర్ఘ్యంతో కూడిన శబ్ద సంకేతాలను ఈ మాల్ వేర్ వంతెనలా ఉపయోగించుకుంటుందని పరిశోధకులు తెలిపారు. 'ఫ్రాన్ హోఫేర్ ఇనిస్టిట్యూట్ ఫర్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అండ్ ఎర్గొనమిక్స్' కు చెందిన ఈ జర్మనీ శాస్త్రవేత్తలు సాధారణ కంప్యూటర్ల స్పీకర్లు, మైక్రోఫోన్ల సాయంతో పాస్ వర్డ్ లు, ఇతర స్వల్ప పరిమాణం లోని డేటాను సెకనుకు 20 బిట్ల వేగంతో 65 అడుగుల పరిధి వరకు పంపగలిగారు. అయితే ఈ పరిధి చాలా తక్కువే అయినప్పటికీ మరిన్ని పరిశోధనల ద్వారా విస్తృతంగా పెంచవచ్చని ఈ మాల్ వేర్ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News